
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని దేవంగా సంఘం ఆధ్వర్యంలో రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగిందని దేవాంగ సంఘం అధ్యక్షుడు కొంగిరాము తెలిపారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సజ్జ ప్రసాద్, కోశాధికారి లక్కవరం సుధాకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.