
జయ్ న్యూస్, ఆర్మూర్: రేపు 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్మికల సంఘం అధ్యక్షులు లింగాపురం బాపూరావు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 8 గంటల పని విధానం అమలు చేయాలని, అదేవిదంగా సరైన పనికి సరైన వేతనం 26,000/- రూపాయలు ఇవ్వాలని, డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న వారికీ కేటగిరీల వారీగా వేతనం ఇవ్వాలని, కార్మికకుల కనీస పెన్షన్ 9000/-రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.