
జయ్ న్యూస్, నిజామాబాద్: నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ని పువ్వుల మొక్కను అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా విదులు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని, వారందరికి తగు న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను నిఖచ్చిగా అమలుచేయాలని, ప్రతీ విషయం తమపై అధికారులకు తెలియజేయాలని, ప్రతీ గ్రామాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానంగా సైబర్ నేరాల పై, కొత్త చట్టాలపై ,మొదలగునవి ప్రజలకు అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు. పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో ఎస్సైలు ఎమ్. కళ్యాణి – ధర్పల్లి, జడ్. సుస్మిత – ముగ్పాల్, ఎమ్. రమా – ఎడపల్లి, కె. శైలెంధర్ – బాల్కొండ,సుహాసిని – మెండోరా, పి. రాజేశ్వర్ – ఏర్గట్ల, కిరణ్ పాల్ – టౌన్ 3 ఉన్నారు.