
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలం దేగాం గ్రామంలోని గంగమ్మ తల్లి మందిర నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంజూరు పత్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం గ్రామస్థులకు అందజేశారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, గ్రామస్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి గంగపుత్ర సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు యాదగిరి, జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షులు బింగి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.