జయ్ న్యూస్, ధర్పల్లి ప్రతినిధి (ఆర్.సి.రెడ్డి) జులై 11: “సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే 100 నంబర్‌కు కాల్ చేయండి. ప్రజల క్షేమమే మా లక్ష్యం” అని ధర్పల్లి ఎస్ఐ మామిడిపల్లి కళ్యాణి పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి విద్యార్థులకు ప్రసంగిస్తూ…మత్తుపదార్థాలపై దూరంగా ఉండాలని, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మైనర్ల వాహనాల నడపడం శిక్షార్హమని స్పష్టం చేశారు. వేధింపులు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మీ పరిసరాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే 100కి సమాచారం ఇవ్వండి,” అని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నాంజి మోహన్ రెడ్డి, షీ టీం కానిస్టేబుళ్లు హరిత రాణి, రేఖ రాణి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.