
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, తాజా మాజీ కౌన్సిలర్ లిక్కి శంకర్ లు అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోటు బుక్స్ లు పంపిణీ చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.