
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ జంబి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ ధనలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు సుప్రజ తెలిపారు. అమ్మవారికి నూతన అభరణాలను అలంకరించామని చెప్పారు. ఆషాడ మాసం శుక్రవారం ఉండడంతో భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు.b