
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరం వసంత నగర్ లో ఉన్న వివేకానంద హై స్కూల్ లో శుక్రవారం ఆషాడ మాసంలో జరుపుకునే తెలంగాణ పండగను పురస్కరించుకొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, శివ సత్తుల మరియు పోతరాజుల వేషధారణలతో అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయ బృందం బోనాలను నెత్తిన పెట్టుకొని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ & ప్రిన్సిపల్ లతా నారా గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ బోనాల గొప్పతనాన్ని మరియు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఉపాధ్యాయ బృందం మా పాఠశాల ఆవరణలో బోనాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. పాఠశాల ఆధ్వర్యంలో అన్ని పండుగలను విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు. సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క కృతజ్ఞతలని ప్రిన్సిపల్ వెల్లడించారు.