
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు నిర్మించనున్న ప్రహరీ గోడకు రెండువైపులా వాక్ వే గేట్స్ ను నిర్మించాలని విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు యామాద్రి భాస్కర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీ అధ్యక్షులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ ఆర్మూర్ బస్ డిపోకు ఉత్తరం భాగంలో ప్రహరీ గోడును నిర్మిస్తున్నారని, కానీ ఈ రోడ్డును ఆనుకొని హౌసింగ్ బోర్డ్, మహాలక్ష్మి కాలనీ, విద్యానగర్ పెర్కిట్ ఆర్మూర్, గణేష్ నగర్ కాలనీ, చాలా స్కూల్స్, కాలేజీలు మరియు ఆస్పత్రులు ఉన్నాయి. మీరు ప్రహరీ గోడను మొత్తం నిర్మించినచో బస్టాండ్ కు వెళ్ళుటకు ప్రజలకు, విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున మీరు ప్రజల, విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ గోడకు రెండు వైపులా మొదట, చివరన వాక్ వే గేట్లు నిర్మించి ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను కోరారు.