
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా PSSM అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి హైదరాబాద్ నగరంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం వద్ద డైనింగ్ హాల్, కిచెన్, సౌకర్యాల గురించి చర్చించినట్లు తెలిపారు. భవిష్యత్తులో సహాయ సహకారాలు అందించాలని వినయ్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలోని అతిపెద్ద 2వ పిరమిడ్ ఆర్మూర్ పట్టణంలో ఉండడం విశేషమని చెప్పుకొచ్చారు.