
జయ్ న్యూస్, ఆర్మూర్:
*అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసిన ఆర్మూర్ బ్యాట్స్మెన్లు.*
*ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మతిన్.*
*తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్.*
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 19, అంతర్ జిల్లాల స్థాయి వన్ డే క్రికెట్ పోటీలలో భాగంగా ఆడివారం రోజు జరిగిన పోటీలలో ఆర్మూర్ క్రికెట్ టీంతో ఆదిలాబాద్ క్రికెట్ టీం పోటీపడగా మొదట టాస్ గెలిచిన ఆర్మూర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకునీ నిర్ణీత 50 ఓవర్లలో 378 పరుగులు చేయగా మతీన్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో 78 పరుగులు చేసి 1.3 ఓవర్లలో 1 మెయిడిన్ ఓవర్ వేసి 1 పరుగు ఇచ్చి 2 వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. కుంట నవదీప్ 71 పరుగులు, షాజహాన్ 64 పరుగులు చేసి ఆర్మూర్ క్రీడాకారులు అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసారు. అదిలాబాద్ క్రికెట్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 89 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. నేడు జరిగిన మ్యాచ్లో మతీన్ తన ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు రతన్, రఫీ లు ఎంపైర్ లుగా, సల్లు స్కోరర్ గా వ్యవహరించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.