
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో నిర్వహించనున్న జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో నిజమైన హీరోలు అంటే క్రీడాకారులేనని ఆయన అభివర్ణించారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమైనవని అన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపునిస్తుందని అన్నారు. అన్ని క్రీడల కన్నా కబడ్డీ క్రీడ చాలా కష్టతరమైందన్నారు. ఇలాంటి ఆటను ఎంచుకొని వివిధ జిల్లాల నుండి జాతీయస్థాయి ఎంపిక కొరకు వచ్చిన సీనియర్ మహిళా పురుషుల క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేషన్ సభ్యులు కోశాధికారి బాబన్న, రాష్ట్ర కమిటీ సలహాదారు అమర్నాథ్ రెడ్డి, జిల్లా కమిటీ అధ్యక్షులు గంగ మోహన్ చక్రు, కార్యదర్శి మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.