
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ, డైరెక్టర్ దొండి రమణ, పింజా అభినవ్, జంగిడి భోజన్న, నూతన్ నారాయణరెడ్డి,చిక్కాల నవీన్, భగత్, గోపి, ఏకే రెడ్డిలు మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఈ లక్ష్యాన్ని ముందుంచుకుని ప్రతి ఒక్కరినీ మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరు మొక్కలు నాటి, మరో ముగ్గురిని ఛాలెంజ్ చేసి పచ్చదనాన్ని విస్తరించేందుకు పునాదులు వేయాలని అన్నారు. ఈ మొక్కలు నాటడం కేవలం ప్రకృతి ప్రేమకు సూచిక మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం మనం చేస్తోన్న మేలైన పెట్టుబడి కూడా అని పేర్కొన్నారు. ప్రతి నాటిన మొక్క ఒక ఊపిరిగా, ఒక నీటి మూలంగా, ఒక జీవానికి ఆశ్రయంగా మారుతుందని అన్నారు. మన పరిసరాలను హరితంగా మార్చేందుకు ముందుకు వచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామనీ డైరెక్టర్ దొండి రమణ అన్నారు.
ఒక మొక్క నాటి – ముగ్గురికి ఛాలెంజ్ చేయండి – ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు అవ్వండి… అని డైరెక్టర్ దొండి రమణ పిలుపునిచ్చారు.