
జయ్ న్యూస్, భీమ్ గల్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సోమవారం ఎస్సై కే. సందీప్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణంలోని కృష్ణవేణి హైస్కూల్ లో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాల అలాగే మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై కే.సందీప్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులు మీ మొబైల్ ఫోన్ కు ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము… మీ అకౌంట్ లో ప్రాబ్లెమ్ ఉంది. తొందరగా ఈ నెంబర్ కు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డీటెయిల్స్ పంపించుమని కాల్ చేస్తే ఇలాంటి వ్యక్తులను అసలు నమ్మకూడదని, మీకు బ్యాంక్ సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే మీరే నేరుగా బ్యాంకుకు వెళ్లి మీ సమస్యను మీ తల్లిదండ్రులతో వెళ్లి పరిష్కరించుకోవాలి సూచించారు. అలాగే గంజాయి, మత్తుపదార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.