
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున బీజేపీ సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్ అందజేశారు. ఈసందర్భంగా ప్రళయ్ తేజ్ మాట్లాడుతూ కల్లడి గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులను సీఎంఆర్ ద్వారా ఇప్పిస్తానని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి అనారోగ్యంతో ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగేష్, అరుణ్, అశోక్, నరేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.