
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S.,ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ని స్వాగతిస్తూ అభినందించారు.