
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిని సోమవారం ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మగ్గిడి ఎత్తిపోతల కమిటీ చైర్మన్ నాగరాజు, వైస్ చైర్మన్ తౌడుశెట్టి సుమన్ మరియు కమిటీ సభ్యులు అశోక్,భూమారెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. మగ్గిడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర మందిరం నుండి ఎత్తిపోతల పథకం భవనం వరకు ప్రస్తుతం మట్టి రోడ్డు ఉండడం వల్ల భారీ వాహనాలు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా మారుతుండడంతో సుమారు 5 కిలోమీటర్ల మేర BT రోడ్డుగా చేయడానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించగలరని వారు వినయ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.