
జయ్ న్యూస్, నిజామాబాద్: మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ పరిధిలో ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరై బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేవి మన తెలంగాణ సాంస్కృతికి , సాంప్రదాయానికి నిదర్శనం అని, మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యము ఎంతో పవిత్రతతో కలిగినదని, అమ్మవారు మన ప్రజలందరినీ ఆశీర్వదించాలని అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.