
జయ్ న్యూస్, నిజామాబాద్: మంగళవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లి లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో సర్వే నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల దాదాపు 6 దశాబ్దాలుగా అనేక వేల మంది విద్యార్థులకు విద్య అందించిన ఒక విద్య కేంద్రం అని అన్నారు. కానీ ఇలాంటి విద్య కేంద్రం ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారిందని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయంలో మన ఊరు మన బడి పథకం కింద సెలెక్ట్ అయ్యింది. అయితే కేవలం పైకప్పు రేకులు మాత్రమే అమర్చారు. మిగతా పనులు చెయ్యటానికి నిధులు రావట్లేదు అని పనులను మద్యలో ఆపేశారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పి తీర అధికారంలో వచ్చిన కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకుండా ఉండటం బాధాకరం అని అన్నారు. అలాగే గర్ల్స్ హై స్కూల్ లో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బాత్రూమ్ కట్టించాలి, అలాగే సరైన ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. అలాగే మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి అని డిమాండ్ చేశారు.. లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామానీ హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ నగర నాయకులు విశాల్, సచిన్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.