
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కార్యశాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అభయ్ పాటిల్, బిజెపి మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ లు పాల్గొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేశారు.