
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దుల గుట్ట ఆలయానికి 50 లక్షల నిధులు మంజూరయ్యాయి.
టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో సిద్దుల గుట్ట ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ కటేజ్ ల నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రకారం నిధులు మంజూరు చేశారని నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు. వినయ్ రెడ్డి, సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.