
జయ్ న్యూస్, ఆర్మూర్: స్వచ్ఛ సర్వేక్షన్ 2024- 2025లో రాష్ట్రస్థాయిలో ఉన్న 143 మున్సిపాలిటీలలో ఆర్మూర్ మున్సిపాలిటీ 29వ ర్యాంకు సాధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. జాతీయస్థాయిలో స్మాల్ సిటీ కేటగిరీలో 1585 మున్సిపాలిటీలలో ఆర్మూర్ మున్సిపాలిటీ 318 ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో ఆర్మూర్ మున్సిపాలిటీ నిలిచిందని అన్నారు. అందరి సహకారంతోనే ఆర్మూర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంక్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు.