
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాన్ని అధ్యక్షులు ఆకుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. లయన్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో భాగంగా జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటామని తెలిపారు. మన జీవితంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చక్కగా వివరించామని తెలిపారు. ప్రతి ఏటా ప్రతి విద్యార్థి తమ ఇంటి ఆవరణలో కనీసం రెండు మొక్కలు నాటి దేశాన్ని పర్యావరణ రహిత దేశంగా మలచుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రధాన కార్యదర్శి లీడర్ శ్రీనివాస్, కోశాధికారి గోపికృష్ణ, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, పోల్కం వేణు, దాచేపల్లి సంతోష్, నసీరుద్దీన్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.