
జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ పెద్ద కూతురు ఆశ్రిత జేఈఈ అడ్వాన్స్ – 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎంట్రాన్స్ లొ ఉత్తీర్ణత సాధించి బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) వారణాసి IIT కి ఎంపిక అయ్యింది. ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి మండలంలోని అంకాపూర్ లో తన స్వగృహానికి ఆహ్వానించి తను ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఐఏఎస్, ఐపీఎస్ కోసం ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఐఐటి వారణాసిలో సీటు సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానం చేసి మిఠాయిని తినిపించారు.