
జయ్ న్యూస్, ఆర్మూర్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ సెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలో గురువారం నాడు దోండి రమణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేసి, 9వ షెడ్యూల్ లో చేర్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పంచాయితీరాజ్ చట్టం 32018లోని 285(భూ%) సెక్షన్ లో సవరణ చేస్తూ ముసాయిదాను పంపిందనీ, రాష్ట్ర గవర్నర్ కాంగ్రెస్ కమిటి జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ ను విడుదల చేసే సన్నాహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ALTE ప్రభుత్వం 2018 పంచాయితీరాజ్ చట్టాన్ని సవరించి అవసరమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చి చారిత్రాత్మకంగా 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు ముందుకు వెళ్ళడం విప్లవాత్మక నిర్ణయమనీ, ఈమేరకు చిత్తశుద్దితో కృషి చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టకు 50 లక్షల రూపాయలు మంజూరు చేయించిన వినయ్ రెడ్డికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.