
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పరిధిలోని క్షత్రియ ఇంటర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ విచ్చేసి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్క వాహదారుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. క్షత్రియ కళాశాల యాజమాన్యం దేవేందర్ మాట్లాడుతూ మీ తల్లిదండ్రులకు కూడా ఈ ట్రాఫిక్ నియమాల గురించి వివరించాలని విద్యార్థులకు సూచించారు. ట్రాఫిక్ ఎస్సై రఘుపతి మాట్లాడుతూ మైనర్లు ఎవరు వాహనాలు నడపవద్దని, పట్టుబడితే కేసులు చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఎస్ఐ రఘుపతి లను కళాశాల యాజమాన్యం శాలువాతో సన్మానించారు.