
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలం కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కుటుంబాలకు సీఎం సహాయనిధి (CMRF) నుండి ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన నవతు రమేష్, తోకారం నరసవ్వ, మహమ్మద్ బేగంలు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి పరిస్థితిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, ఆయన చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రోజున రమేష్ కి రూ.60,000, నరసవ్వ రూ.32,000, మహమ్మద్ బేగం కు రూ.22,000 చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, వైస్ మల్లారెడ్డి, ఉదయ్, సంజీవ్,గంగారెడ్డి, బిరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.