
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మామిడిపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో ఘనంగా కలర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రీస్కూల్ విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్, మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్, సన్రైజ్ కలర్స్, ప్రొఫెషన్స్ డాక్టర్, పోలీస్, ఆర్మీ, లాయర్ మరియు మిగితా డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ కలర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మరియు వారి ఇండ్లలో వాడే కలర్స్ గురించి విద్యార్థులు చాలా చక్కగా తల్లిదండ్రులకు వివరించారు. ప్రీ స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు రంగుల ప్రత్యేకత గురించి వివరించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వలన విద్యార్థులకు స్పీకింగ్ మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెప్పారు. ముందు ముందు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్ లు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఏ రంగు దేనికి నిదర్శనం అనే అంశం పైన ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు భవిష్యత్తులో కలర్ ఫుల్ జీవితం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన ప్రీస్కూల్ విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ప్రీస్కూల్ ఉపాధ్యాయులు సౌమ్య, జ్యోతి, ప్రవళిక, స్రవంతి, ఆషిత, శృతి మరియు అకాడమిక్ ఇంచార్జ్ అతుఫా నౌసిన్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.