
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి మరియు ఎంపీడీవో గంగాధర్ అధ్యక్షతన మండల స్థాయి శాఖల సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వనమోత్సవం నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్), సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై సమగ్ర చర్చ నిర్వహిచారు.
ప్రత్యేక అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ, వనమోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని, ప్రతి శాఖ సమన్వయంతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని, వానాకాలాన్ని సద్వినియోగం చేసుకొని వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులు నివేదిక సమర్పించగా, పని వేగాన్ని మరింత పెంచాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో ఎంపీఓ, ఆర్డబ్ల్యూఎస్ మరియు ఇరిగేషన్ శాఖల ఏఈలు, హెల్త్ సూపర్వైజర్లు, ఐసిడీఎస్ సూపర్వైజర్లు, ఏపీఎం, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCలు), ఎగ్గీఎస్ ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.