
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం (గొల్ల) సభ్యులు శుక్రవారం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తమ సంఘ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సంఘ అభివృద్ధికి అవసరమైన నిధులు త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గంగోల్ల ప్రళయ్ తేజ్, సంఘ నాయకులు,రమేష్,బీముడు, నూకల రవి, గొల్ల శ్రీను, మోహన్,గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.