
జయ్ న్యూస్, నిజామాబాద్:
*జూలై 23న నిర్వహించే విద్యా సంస్థల బంద్ పోస్టర్ విడుదల*
*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి*
*SFI – AISF – PDSU – PDSU – – AIPSU వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్*
ఈ నెల జూలై 23 న జరిగే విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోస్టర్స్ నీ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చేయకపోవడం బాధాకరం. 8000 కోట్ల పైచిలుకు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయలు 150 కోట్లు విడుదల చేయాలని ఈ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ స్కీం ద్వారా చేరిన విద్యార్థుల భవిష్యత్తు తో ఆటలాడుకోవడం సరికాదని వెంటనే బకాయిలను విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఇప్పటికి విద్యాశాఖకు మంత్రిని
కేటాయించకపోవడం సబబు కాదని విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన మెనూని అమలు చేయాలని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావాలని లేకపోతే జులై 23న జరిగే విద్యాసంస్థల బంద్ తో విద్యార్థులను కదిలించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, ఏఐపీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ పి డి ఎస్ యు సాయి, మనోజ్, చరణ్, గౌతమ్, పి డి ఎస్ యు జిల్లా నాయకులు నజీర్, వినోద్, సృజన్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఆజాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.