
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా క్యాబినేట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించుకొన్నామని పాఠశాల ప్రిన్సిపల్ రజని కుమారీ తెలిపారు. ముఖ్య అతిథిగా AGM శివాజీ హాజరయ్యారు. ప్రతీ సంవత్సరం క్యాబినేట్ ఎన్నికలు నిర్వహించడం వలన విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య పద్దతిలో ఎలా ఎన్నికలు జరుగుతాయో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని GM గోపాల్ రెడ్డి, DGM రమణ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ నాయకత్వ లక్షణాల గురించి వివరించారు. ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థులందరికి అభినందనలు తెలపారు. ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులందరికి అభినందించారు. హెడ్ బాయ్ గా 9వ తరగతి విద్యార్థి Y. శివ కుమార్, హెడ్ గర్ల్ గా 9వ తరగతి విద్యార్థిని లక్ష్య, డిప్యూటీ హెడ్ బాయ్ గా మితున్, డిప్యూటీ హెడ్ గర్ల్ గా అధ్య శ్రీ, Jr. హెడ్ బాయ్ గా శ్రీహాన్, Jr. హెడ్ గర్ల్ గా నయనశ్రీ ని అభినందించారు. నారాయణ విద్యా సంస్థల మెరుగైన విద్యతో పాటు, విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కారక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరై వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇందులో పాఠశాల ZCO రాకెష్, AO నవీన్, ఎలక్షన్ ఇంచార్జ్ రాజేశ్వర్, Dan చిన్నరాజు, పాఠశాల వ్యాయాము ఉపాధ్యాయులు మోహన్, మీనా, విద్యార్థులు పాల్గొన్నారు.