
జయ్ న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఆర్ & బి అతిథి గృహంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా ఆర్థిక సమీక్ష సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఆయనను మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాదిగ హక్కుల దండోరా నాయకులు కొక్కెర భూమన్న మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొక్కెర భూమన్న మాట్లాడుతూ దళితుల పట్ల నిజాయితీగా వివరించి చట్టప్రకారం భూములను కేటాయిస్తూ ఆర్థికంగా ఎదుగుదలకు దోదపడే విధంగా సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవానీ రెడ్డి, సరిత, గోపి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.