
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన డ్యాగల భువనేశ్వర్ గుండె జబ్బుతో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డికి విన్నవించడంతో వారు వెంటనే శాస్త్ర చికిత్స కోసం స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసి ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలను అతని భార్య సువర్ణకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వారి కార్యాలయంలో అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎల్ఓసి కాపీ ఇప్పించిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.