
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సాయి వోకేషనల్ జూనియర్ కళాశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి, బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించామని తెలిపారు.
విద్యార్థినీలు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.