
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో బాధితులకు సీఎంఆర్ఎఫ్ 52,000 రూపాయల చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. రాసా సుశీలకు 10 వేలు, బ్యాగరి రవితేజ కు 10 వేలు, గడ్డం శోభ కు 32 వేల రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన వినయ్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు శశి కుమార్, గుత్ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవి గౌడ్, భూమేశ్వర్, ప్రసాద్, గంగాధర్ , నరేష్, నవీన్, భూమన్న , రాజన్న, గంగాధర్ , సాయి కుమార్, విజయ్ గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.