
జయ్ న్యూస్, నవీపేట్: సోమవారం రాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., నవీపేట్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్
పోలీస్ స్టేషన్ ను మొత్తం కలియతిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం కోసం కృషి చేయాలని అన్నారు.
రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు.
వాహనాల పార్కింగ్ చూసారు.
CC కెమెరాల ప్రాముఖ్యతను వాణిజ్య సాముదయాలు, గ్రామాలలోని ప్రధానమైన చౌరస్తా లలో, ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.
రౌడీ షీటర్ లను ప్రతీ రోజు వారి దిన చర్యను గ్రహించి వారు మళ్ళీ ఎలాంటి నేరాలు చేయకుండా తగు చర్యతీసుకోవాలని, వారి ఆగడలను పూర్తిగా అనగద్రోకాలని తెలిపారు.
గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.
సిబ్బంది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా నార్త్ రూరల్ సీ.ఐ బి. శ్రీనివాస్ , నవీపేట్ SHO కే.వినయ్ లు పాల్గొన్నారు.