
జయ్ న్యూస్, ఇందల్వాయి: మంగళవారం ఇందల్వాయి టోల్ ప్లాజా ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్డు భద్రత లో భాగంగా మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు బార్డర్ టోల్ ప్లాజా అయిన ఇందల్వాయికు వచ్చి బార్డర్ టోల్ ప్లాజా కావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది మరియు ఇందల్వాయి మండలంలోని ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పోర్ట్స్ ను సందర్శించి అక్కడ రోడ్డు ప్రమాదాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు సూచనలను ఇవ్వడం జరిగింది. మరియు గ్రామాల్లో ప్రజలకు రోడ్డు భద్రత మరియు ఆ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజలకు వివరించమని ఆదేశించినారు. మరియు ప్రమాదాలపై విన్యుతంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. భారీ వర్షాలకారంగా రోడ్స్ బ్లాక్ అయ్యే ప్రదేశాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.