
జయ్ న్యూస్, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని బిజెపి కార్యకర్తల సమావేశాన్ని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ కుమార్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు కాలయాపన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలవిల లాడుతుంటే వారి యొక్క సంతోషానికి అడ్డు కట్టలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం18 నెలలు గడుస్తున్నా ఈ రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. ఏసిన పంట ఏసినట్టే ఎండిపోతుంది అని ఇదిగో రైతు భరోసా అదిగో రైతు భరోసా అని కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీల వారికి తగిన గురపాటం నేర్పిస్తామని రానున్న ఎలక్షన్లలో మా సత్తా ఏందో చూపిస్తామని కులచారి దినేష్ అన్నారు. కార్యకర్తలను చూస్తుంటే బిజెపి మా ముందు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. ఈ ఉత్సాహం ఎవరు ఆపలేరు అని ఆయన అన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బిజెపి సత్తా ఏందో చూపించాలని దినేష్ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే ఫలితం ఉంటుందని సర్పంచ్ ఎలక్షన్ గాని ఎంపీటీసీ ఎలక్షన్ గాని ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకు నడవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి మహేందర్ భాస్కర్ అశోక్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.