
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సభ్యులు మంగళవారం నాడు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చెరువులు కబ్జా కాకుండా చూడాలని చెరువు కట్టపై గంగమ్మ తల్లి ఆలయానికి, చేపల మార్కెట్ కు, కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో ఆలయాానికి నిధులు మంజూరు చేపించే బాధ్యత తనదని 20 శాతం నిధులు దేవాదాయ శాఖకు చెల్లిస్తే 80 శాతం నిధులు కలుపుకొని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేని గంగపుత్ర సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర మాజీ అధ్యక్షుడు పెంటన్న,ఆలూరు
అధ్యక్షుడు గంగాధర్,ఉపాధ్యక్షుడు సాయిలు,సంఘం సెక్రటరీ సుమన్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు