
జయ్ న్యూస్, సిరికొండ :నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామానికి చెందిన మోడల్ స్కూల్ విద్యార్థిని బొబ్బిలి షర్మిల త్రిబుల్ ఐటీలో సీటు సాధించి ప్రతిభ చాటింది. తండ్రి బొబ్బిలి రాజు కుమార్తె అయిన షర్మిల, ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 542 మార్కులు సాధించింది.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అంతటి ప్రతిభ కనబరిచినందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూల్లో చదువుతూ గమ్యం వైపు పట్టుదలతో కృషి చేసిన షర్మిలను ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె విజయం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.