
జయ్ న్యూస్, సిరికొండ: పెద్ద వాల్గోట్ గిర్ని చౌరస్తా వద్ద బుదవారం ఉదయం గుర్తు తెలియని బైక్సవారీ, పిట్ల నర్సవ్వ అనే మహిళ మెడలో ఉన్న రెండు తులాల బంగారు తాడును గుంజేసి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళలు బంగారు ఆభరణాలతో ఒంటరిగా ప్రయాణించకూడదని, అనుమానాస్పదులను చూసిన వెంటనే సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు సూచించారు.