
జయ్ న్యూస్, సిరికొండ : సిరికొండ మండలం న్యవనంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సమాజ సేవలో ముందుండే ఏనుగు దయానంద్ రెడ్డి రూ. 75,000 విలువైన డెస్క్ బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమం మహిపాల్, ఆయన మిత్రుడు రాజ్‌కుమార్ పి.డి. సహకారంతో కార్యరూపంలోకి వచ్చింది.పిల్లల విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది ఓ మంచి అడుగు అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ దయానంద్ రెడ్డికి పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.