
జయ్ న్యూస్, ఆర్మూర్: బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి నడపలేని స్థితిలో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా 6700 కోట్లు ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఆడబిడ్డలందరికీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డ అడుగుకు అర్థం చెప్పిన పాలనకు ఇది గొప్ప నిదర్శన18 నెలల్లోనే…
200 కోట్ల ఉచిత ప్రయాణాలు–ఇది అభివృద్ధికి కాదు, ఆత్మవిశ్వాసానికి బస్సు టికెట్టు. ఈ పథకంతో
ప్రతి మహిళ భయంతో కాకుండా ధైర్యంతోగమ్యానికి చేరుకుంటోంది. ఇది ప్రభుత్వం అందించిన ఓ భరోసా…ఇది మార్పు మొదలైన దశ…ఈ అవకాశాన్ని వినియోగించుకున్న
లక్షలాది స్త్రీలకు నా మనఃపూర్వక అభినందనలు. ఈ పథకాన్ని రోజూ విజయవంతంగా నడిపిస్తున్న
RTC డ్రైవర్లు, కండక్టర్లు , సిబ్బంది, యాజమాన్యం మీ అందరి శ్రమకు వందనమన్నారు. మీరు నడుపుతున్నది బస్సులు కాదు…ఓ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే నిజమైన సంక్షేమ పాలనకు అద్దం.. మహిళా సాధికారతకు అడుగులు వేస్తున్న ప్రజా పాలన ఇట్టి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కలకు, మంత్రి మండలి అందరికీ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పాలన చేపట్టిన పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్మూర్ ప్రాంత ప్రజల కొరకై ప్రత్యేక చొరవ చూపిస్తున్న వినయ్ రెడ్డి పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని రానున్న స్థానిక ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.