
జయ్ న్యూస్, సిరికొండ: సిరికొండ మండలం చిన్న వాల్గొట్ సిరికొండ బైపాస్ రోడ్డుపై ఇటీవలే ప్యాచ్ వర్క్ కింద రూ.10 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మతులు నామమాత్రపు విధంగా చేపట్టారు. అదికాస్తా నెల కూడా కాకముందే రోడ్డు మళ్లీ గుంతలుగా మారి వాహనదారులను ఇబ్బందులకీ గురి చేస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, పనుల నాణ్యతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాచ్ వర్క్ ప్రాంతాల్లో పట్టీలు లేకుండా కేజీ ట్రాక్టర్లు నడుపుతున్న వాహనదారుల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఇలా రోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులు స్పందించాలని, పట్టీలు లేకుండా నడుపుతున్న కేజీవిళ్లను వెంటనే సీజ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిరికొండ మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.