
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ స్టేట్ SC&ST ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ 621/14 కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనది. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి, గంగారం పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షులుగా పరుశురాం, ప్రధాన కార్యదర్శిగా మారయ్య, కార్య నిర్వహణ అధ్యక్షులుగా శివ, కోశాధికారిగా రాజన్న, ఉపాధ్యక్షులుగా ప్రకాష్, గంగ కిరణ్, గొన్యా, అసిస్టెంట్ సెక్రటరీలుగా వీరయ్య, అరుణ్ కుమార్, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రవి సింగ్, ఎల్లయ్య, భూమేష్, కల్చరల్ సెక్రటరీలుగా సంతోష్, ప్రభాకర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు 621/14 SC&ST అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.