
జయ్ న్యూస్, నందిపేట్: నందిపేట్ గ్రామపంచాయతీలోని అన్ని వార్డుల్లో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఓ ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శి మహేందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నామని, బయోలార్వా ఆయిల్ బాల్స్ వేస్తున్నామని తెలిపారు.