
జయ్ న్యూస్, సిరికొండ: జులై 23: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వరుసగా అభివృద్ధి పనులు జరగడం బీజేపీకి నచ్చడం లేదని ,ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్న ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని లక్ష్యంగా చేసుకొని బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారనీ సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మండిపడ్డారు. ఈ సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రజల మద్దతును కోల్పోతున్న బీజేపీ నేతలు నకిలీ ఆరోపణలు, దుష్ప్రచారాల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని,అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న ఈ ప్రచారయజ్ఞాన్ని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.ఓ వైపు పథకాలు నేరవేర్చే శ్రమ, మరోవైపు అవమానించేందుకు కుట్రలు – బీజేపీ అసలు రంగు ప్రజల ముందే బయటపడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోందని,రూరల్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ నకిలీ నాటకాలను గమనిస్తూ, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాకారం రవి, మల్లేష్, ఎర్రన్న, రమేష్, నర్సారెడ్డి, రాములు, సిరికొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, దేగం సాయన్న, రామస్వామి, రాము, రాజారెడ్డి, ఆసిఫ్, చందర్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు