
జయ్ న్యూస్, భీమ్ గల్: భీంగల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో వర్షాకాలం నీరు నిల్వ ఉండే ప్రాంతంలో నిల్వ ఉండకుండా చూడాలని సిబ్బందిని కమిషనర్ గోపు గంగాధర్ గారు ఆదేశించారు. ఒకటో వార్డులోని రాజారాం నగర్ కాలనీలో మురికినీరు నిల్వ ఉండడంతో మున్సిపల్ సిబ్బందివాటిని వెంటనే తొలగించాలని ఆదేశించడం జరిగింది. వెంటనే వారు మురికి నీరుని తొలగించడం జరిగింది. వర్షాకాలం పట్టణంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని కోరడం జరిగింది.