
జయ్ న్యూస్, ఆర్మూర్: గౌడ కుల సమస్యలపై పోరాడతానని, సంఘ సభ్యులకు అండగా ఉంటానని ఆర్మూర్ టౌన్ గౌడ యువసేన అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గౌడ సంఘం పెద్దలు జిల్లా అంజాగౌడ్, రామస్వామి సత్యనారాయణ గౌడ్ ఆయనను కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ నిన్న జరిగిన యువసేన ఎన్నికలో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీనివాస్ గౌడ్ గెలుపొందడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆయన గౌడ కులస్తులందరికీ అండగా నిలవాలని అన్నారు. ఆర్మూర్ టౌన్ గౌడ యువసేన అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి వారికి మేమంతా అండగా ఉంటామని అన్నారు.